కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు ఆ ఆఫర్‌ను ట్రంప్ ఉపసంహరించుకున్నారు. ఇకపై కశ్మీర్‌కు సంబంధించిన మధ్యవర్తిత్వం అంశం ప్రస్తావనే ఉండబోదని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబారి హర్ష వర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు.
కశ్మీర్ అంశంపై ఏనాడూ అమెరికా మధ్యవర్తిత్వం వహించలేదని, సమస్యలను పరిష్కరించే దిశగా భారత్-పాకిస్థాన్‌ను ప్రోత్సహించడమే అగ్రరాజ్య విధానమని ష్రింగ్లా తెలిపారు.
"భారత్-పాక్ అంగీకరిస్తేనే కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి మధ్యవర్తిగా ఉంటానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఆఫర్‌ను భారత్ అంగీకరించకపోవడం వల్ల మధ్యవర్తిత్వం చేసే యోచనను ట్రంప్ ఉపసంహరించుకున్నారు."
- హర్ష వర్ధన్ ష్రింగ్లా, అమెరికాలోని భారత రాయబారి