తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ సన్నిహితుడికి శిక్ష - manafort

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ మాజీ ప్రచార సారథి పాల్ మనఫోర్ట్​కు 47 నెలల జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత, బ్యాంకు మోసం కేసుల్లో నేరాలకు పాల్పడినందుకు ఈ శిక్ష ఖరారైంది.

ట్రంప్ సన్నిహితుడికి శిక్ష

By

Published : Mar 8, 2019, 1:51 PM IST

ట్రంప్ సన్నిహితుడికి శిక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార విభాగం మాజీ ప్రధాన అధికారి పాల్​ మనఫోర్ట్​కు 47 నెలల కారాగార శిక్ష పడింది. పన్ను ఎగవేత, బ్యాంకు మోసం కేసుల్లో అలెగ్జాండ్రియాలోని న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది.

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు మనఫోర్ట్.​ అయితే... ఈ కేసుకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.

మాస్కోతో సంబంధాలున్న ఉక్రెయిన్ రాజకీయ నేతలతో మనఫోర్ట్​ పదేళ్లు పని చేశారు. ఆ సమయంలో ఉక్రెయిన్ నేతలకు చెందిన 55 మిలియన్​ డాలర్లను అక్రమంగా సైప్రస్​లోని బ్యాంకుల్లో దాచిపెట్టారన్నది అభియోగం.

ఈ కేసులో మన్​ఫోర్ట్​తో పాటు ట్రంప్​తో పనిచేసిన మరో ఐదుగురు మాజీ అధికారులపైనా అభియోగాలున్నాయి.

మనఫోర్ట్​పై మరోకేసు విచారణ వచ్చేవారం జరగనుంది. నేరం రుజువైతే కనీసం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details