తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాను జవాబుదారీ చేయాల్సిందే: ట్రంప్

చైనా తీరుపై ఐక్యరాజ్యసమితిలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ దేశాన్ని ఐరాస జవాబుదారీని చేయాలని నొక్కిచెప్పారు.

Trump blasts China for unleashing COVID-19 onto the world
చైనాను జవాబుదారీ చేయాల్సిందే: ట్రంప్

By

Published : Sep 22, 2020, 9:01 PM IST

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో చైనా లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనాకు చైనానే కారణమని మరోసారి ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాను ఐరాస జవాబుదారీని చేయాలని అన్నారు.

"ఓ అదృశ్య శత్రువుపై మనం తీవ్రమైన పోరాటం చేస్తున్నాం. 188 దేశాల్లో చైనా వైరస్ లెక్కలేనన్ని జీవితాలను బలితీసుకుంది. ఈ వ్యాధిని ప్రపంచానికి వ్యాప్తి చేసిన దేశం చైనా. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తొలి రోజుల్లో దేశీయ విమానాలపై నిషేధం విధించి.. అంతర్జాతీయ విమాన సర్వీసులను కొనసాగించింది."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకదని.. చైనా ప్రభుత్వం, చైనా నియంత్రణలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుడు ప్రకటనలు చేశాయని మండిపడ్డారు ట్రంప్. చైనాను ఐరాస జవాబుదారీగా చేయాలని నొక్కి చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details