ప్రభుత్వాన్ని పాక్షికంగా మూసివేసి అమెరికన్ల మనోభావాలను ట్రంప్ దెబ్బతీశారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు.
నేను అడిగినంత ఇవ్వాల్సిందే: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణ నిధుల కోసం అత్యవసర పరిస్థితి విధించిన సంగతి తెలిసిందే. తాజాగా 2020 బడ్జెట్లో గోడ నిర్మాణం కోసం 8.6 బిలియన్ డాలర్ల కేటాయింపును ప్రతిపాదించనున్నారు. ట్రంప్ నిర్ణయంతో విభేదాలు తప్పవని డెమోక్రాట్లు స్పష్టం చేశారు.
8.6 బిలియన్ డాలర్లు కావాలి : ట్రంప్
ట్రంప్ గతేడాదే గోడ నిర్మాణానికి 5.7 బిలియన్ డాలర్లు కోరారు. ఈ విషయమై అధ్యక్షుడుకి, డెమోక్రాట్లకు మధ్య సంధి కుదరకపోవడం వల్ల పాలన 35 రోజుల పాటు పాక్షికంగా మూతపడింది. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద పాక్షిక మూసివేత.
గోడ నిర్మాణం జరిగితే దేశంలో అక్రమ వలసలు తగ్గుతాయని, దేశ భద్రత మరింత పెరుగుతుందన్నది ట్రంప్ వాదన.
Last Updated : Mar 11, 2019, 10:49 AM IST