తెలంగాణ

telangana

అఫ్గాన్​ నుంచి వచ్చేవారికి అమెరికా సాయం- ఒక్కొక్కరికీ ఎంతంటే...

By

Published : Sep 5, 2021, 2:32 PM IST

తాలిబన్ల ఆక్రమణ తర్వాత దేశం విడిచి అమెరికాకు చేరుకున్న అఫ్గాన్ శరణార్థులకు బైడెన్ సర్కారు తీపి కబురు చెప్పింది. వీరందరి పునరావాసం కోసం నిధులు కేటాయించింది. ఒక్కొక్కరికీ సుమారు రూ.లక్షా 60 వరకు ఇవ్వనున్నట్లు తెలిపింది.

us aid to afghanistan
అఫ్గానీలకు అమెరికా సాయం

తాలిబన్లకు భయపడి అమెరికా వచ్చిన అఫ్గాన్ పౌరులను ఆదుకునేందుకు(us aid to afghanistan) అగ్రరాజ్యం కీలక చర్యలు చేపట్టింది. మొత్తం 50 వేల మంది సంరక్షణ బాధ్యతలను చూసుకోనున్నట్లు(us afghanistan) తెలిపింది. కూడు, గూడు ఇతర అత్యవసరాల కోసం ఒక్కొక్కరికి 2,275 డాలర్లను (సుమారు రూ.లక్షా 60 వేలు) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పునరావాసం కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుందని హోంల్యాండ్ సెక్రెటరీ అలెజాండ్రో మయోర్కాస్ పేర్కొన్నారు.

తరలింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి.. గత బుధవారం నాటికి 23 వేల మంది అఫ్గాన్ పౌరులు అమెరికాకు(us evacuation from afghanistan) వచ్చినట్లు తెలుస్తోంది. డెలావేర్ రాష్ట్ర మాజీ గవర్నర్ జాక్ మార్కెల్.. పునరావాస పనులను పర్యవేక్షిస్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ.. పునరావాసం కోసం నిధులు(afghan resettlement us) కేటాయించింది. ఇందులో నుంచే అందరికీ నగదు సాయం చేయనున్నారు.

వీసా కోసం

అఫ్గాన్ శరణార్థులు అమెరికాలో శాశ్వత వీసా(us visas for afghan refugees) కోసం దరఖాస్తు చేసుకునేందుకు సంవత్సరం సమయం ఇస్తారు. ప్రభుత్వంతో పాటు పలు సంస్థలు సైతం వీరికి సహాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. తరలింపు ప్రక్రియకు మద్దతుగా సాయం చేస్తున్నాయి. ఎయిర్​ బీఎన్​బీ అనే కంపెనీ.. అఫ్గాన్ పౌరుల కోసం 20 వేల ఇళ్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details