అమ్మాయిలకు పొడవు కాళ్లుంటే అందంగా కనిపిస్తారు. అందుకే ఫ్యాషన్ రంగంలో పొడవు కాళ్లున్న వారికి ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే, తన కాళ్లు కూడా పొడవవుతున్నాయి.. ఎంచక్కా ఫ్యాషన్‌రంగంలో అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకోవాలని భావించిందామె. కానీ, ఆమె కాళ్ల పొడవు పెరిగి పెరిగి ఏకంగా ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన కాళ్లున్న మనిషిగా నిలిచింది.
గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన పొడవు కాళ్ల సుందరి - గిన్నిస్ రికార్డు
ఫ్యాషన్‌రంగంలో అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన ఓ అమ్మాయి పొడవు కాళ్లుంటే ఎక్కువ అవకాశాలు వస్తాయని మురిసిపోయింది. అయితే ఆ కాళ్లు పెరిగి పెరిగి ఏకంగా ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన కాళ్లున్న వ్యక్తిగా నిలిచిందామె. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. 6 అడుగులకుపైగా ఎత్తున్న ఆ 17 ఏళ్ల అమ్మాయి గురించి తెలుసుకోండి.
టెక్సాస్‌కు చెందిన పదిహేడేళ్ల మకి కుర్రిన్ తాజాగా ప్రపంచంలో అత్యంత పొడవైన కాళ్లు ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. మకి ఎత్తు 6 అడుగుల 10 అంగుళాలు. కానీ, ఆమె ఎత్తులో అరవై శాతానిపైగా కాళ్లే ఉన్నాయి. ఎడమకాలు 135.2 సెంటీమీటర్లు ఉండగా.. కుడి కాలు 134.3 సెంటీమీటర్లు ఉంది. ఆమె కుటుంబ సభ్యులంతా పొడవుగానే ఉంటారట. అయితే, ఎవరూ తనంత ఎత్తు లేరని మకి చెబుతోంది. ప్రస్తుతం అత్యంత పొడవైన కాళ్లు ఉన్న మహిళ, టీనేజీ అమ్మాయిల విభాగంలో రికార్డు కొట్టిన మకి.. ఎప్పటికైనా అత్యంత పొడవు కాళ్లున్న మోడల్‌గానూ రికార్డు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.