ప్రపంచవ్యాప్తంగా కాల్పుల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆగంతుకులు పైశాచికంగా కాల్పులు జరుపుతున్నారు. బహిరంగ ప్రదేశాలు, థియేటర్లు, పాఠశాలలు, మైదానాలు... ఇలా పరిసరాలతో సంబంధం లేకుండా హింసకు పాల్పడుతున్నారు.
అమెరికాలో ఈ తరహా ఘటనలు మరింత ఎక్కువ. ముఖ్యంగా విద్యార్థులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ దారుణాల నుంచి విద్యార్థులను రక్షించడానికి అమెరికాలోని యూటా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్థానిక పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు ఆగంతుకులను ఎదుర్కొనేందుకు శిక్షణ అందిస్తున్నారు.