అమెరికా దక్షిణ కాలిఫోర్నియా... ఓ గ్యాంగ్స్టర్ దుశ్చర్యకు ఉలిక్కిపడింది. కత్తులతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డాడు దుండగుడు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కాలిఫోర్నియాలోని గార్డెన్ గ్రోవ్ ప్రాంతంలో దాడులు ప్రారంభించి.. పలు ప్రాంతాల్లో హింసకాండకు పాల్పడ్డాడు.
నిందితుడిని 'జాచరీ కాస్టేనెడా'గా గుర్తించారు పోలీసులు. నెల రోజుల క్రితమే మాదకద్రవ్యాలు, నిషేధిత ఆయుధాల కేసులో జైలు నుంచి బెయిల్పై విడుదలైనట్లు తెలిపారు.