తెలంగాణ

telangana

ETV Bharat / international

సంగీత ప్రియులకు 'స్పాటిఫై'

అమెరికాలో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన పాటల యాప్​ 'స్పాటిఫై' భారత మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు మంది వినియోగదార్లను కలిగి ఉంది ఈ యాప్​.

స్పాటిఫై

By

Published : Mar 1, 2019, 10:48 AM IST

గానా, అమెజాన్ మ్యూజిక్, సావన్ లాంటి యాప్​లు సంగీత ప్రియులకు వినసొంపైన సంగీతాన్ని అందిస్తున్నాయి. తాజాగా వీటికి పోటీగా మరో యాప్ వచ్చేసింది. అమెరికాలో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన స్పాటిఫై భారత మార్కెట్​లోకి అడుగుపెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా 200మిలియన్ల మంది వినియోగదార్లను కలిగి ఉంది స్పాటిఫై. వీరిలో 8.7 కోట్ల మంది ప్రీమియం చెల్లించి మరీ ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టు సంస్థ తెలిపింది. డబ్బు చెల్లించి వినియెగించుకునే వారికి(పెయిడ్​ సబ్​స్క్రైబర్లు) నెలకు రూ.119గా ధర నిర్ణయించింది.

ఈ యాప్​లో సరికొత్త ఫీచర్లతో ట్రెండ్​కు తగ్గట్టుగా పాటలు అందుబాటులో ఉంటాయి. వివిధ భాషలలో వినియోగదారుని అభిరుచి మేరకు ప్లేలిస్ట్​లో సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఆయా ప్రాంతాల ట్రెండ్​బట్టి గేయాలను ఎంచుకునే వీలు కల్పించింది స్పాటిఫై.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details