అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో మరొకరు.. కొవిడ్ బారిన పడ్డారు. ట్రంప్ పెద్ద కుమారుడు, జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని శ్వేతసౌధంలోని ఓ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
ట్రంప్ కుటుంబంలో మరొకరికి కరోనా - జూనియర్ ట్రంప్‌నకు కరోనా పాజిటివ్
అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్‌నకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. లక్షణాలు ఏమీ లేకపోయనా క్వారంటైన్లో ఉండనున్నట్లు తెలిపారు.
ట్రంప్ కుటుంబంలో మరొకరికి సోకిన మహమ్మారి
ఈ వారం ప్రారంభంలో కరోనా పరీక్షలు చేయించుకున్న జూనియర్ ట్రంప్‌నకు పాజిటివ్‌గా తేలింది. లక్షణాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆయన క్వారంటైన్లోకి వెళ్లారు. గతంలో వైరస్ బారిన పడిన అధ్యక్షుడు ట్రంప్, మొదటి మహిళ మెలానియా ట్రంప్, వారి కుమారుడు బారన్ కోలుకున్నారు.