తెలంగాణ

telangana

ETV Bharat / international

స్పేస్​ ఎక్స్: 60 ఉపగ్రహాలతో నింగికెగిరిన ఫాల్కన్​​ - spacex news

స్పేస్​ ఎక్స్​ సంస్థ... 60 చిన్న కృత్రిమ ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టింది. స్పేస్​ ఎక్స్​ ఫాల్కన్​ రాకెట్​ ద్వారా ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరాయి. ప్రపంచంలో ఏ మూలకైనా ఇంటర్నెట్​ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రయోగాన్ని నిర్వహించింది స్పేస్​ ఎక్స్​.

60 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్​ ఎక్స్​

By

Published : Nov 12, 2019, 10:19 AM IST

స్పేస్​ ఎక్స్​ ప్రయోగం

ప్రైవేటు అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్‌ ఎక్స్‌.. 60 చిన్న కృత్రిమ ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ కవరేజ్ కోసం ఉద్దేశించిన కక్ష్యా నెట్‌వర్క్‌లో ఇది రెండో విడత ప్రయోగం. ఈ మేరకు స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా వీటిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు.

ప్రపంచంలోని ఏ మూలకైనా అధిక వేగంతో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందించాలన్న స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ ఆలోచన మేరకు వీటిని ప్రయోగించారు. ఉత్తర అమెరికా, కెనడాలో వచ్చే ఏడాది నాటికి ఈ సేవలను ప్రారంభించాలని ఎలాన్‌ మస్క్‌ భావిస్తున్నారు. 24 ప్రయోగాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చూడండి:-హృతిక్​ను అభిమానించినందుకు భార్యను చంపిన భర్త!

ABOUT THE AUTHOR

...view details