తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో 20 ఏళ్లలోనే అతిపెద్ద భూకంపం - US

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గత 20 ఏళ్లలోనే అతిపెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6.4 తీవ్రవ నమోదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాలిఫోర్నియాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ట్వీట్ చేశారు.

అమెరికాలో భారీ భూకంపం.

By

Published : Jul 5, 2019, 6:25 AM IST

Updated : Jul 5, 2019, 7:24 AM IST

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. గత రెండు దశాబ్దాల కాలంలో ఇదే అతిపెద్దదని తెలిపారు అధికారులు. భూకంప లేఖినిపై తీవ్రత 6.4గా నమోదైనట్లు పేర్కొన్నారు.

అమెరికాలో భారీ భూకంపం.

రిడ్జర్​క్రెస్ట్​ పట్టణానికి 10 కి.మీ దూరంలో కౌంటీ సీర్లెస్​ లోయ ఎడారి ప్రాంతంలో 10:33 గం.లకు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావం చుట్టుపక్కల 250 కి.మీ వరకు వ్యాపించినట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోసారి భూకంపం వచ్చే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

పరిస్థితిపై ట్రంప్​ ట్వీట్​

దక్షిణ కాలిఫోర్నియాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ట్వీట్ చేశారు.

" భూకంపం గురించి అధికారులు వివరించారు. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది."

-ట్రంప్​ ట్వీట్​

ఇదీ చూడండి: చైనాలో ప్రచండ గాలులకు ఆరుగురు బలి

Last Updated : Jul 5, 2019, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details