పొగతాగే అలవాటు ఉన్నవారు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల (సీఓపీడీ)తో బాధపడేవారిపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. వీరి ఊపిరితిత్తుల్లో ఏసీఈ-2 ఎంజైమ్ అధిక స్థాయిలో ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది.
చైనాలోని కరోనా బాధితులపై చేసిన ఈ పరిశోధన.. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురితమైంది. సీఓపీడీతో బాధపడుతున్న 21 మంది, ఈ సమస్య లేని మరో 21 మంది కరోనా బాధితుల శాంపిల్స్‌ను సేకరించి పరిశోధన చేశారు. ప్రస్తుతం పొగతాగే వారు, మానేసినవారిపైనా పరిశోధనలు చేశారు. వారి ఊపిరితిత్తులపై ఏసీఈ-2 స్థాయిలను విశ్లేషించారు.
అధిక స్థాయిలో..
ప్రస్తుతం పొగ తాగేవారి ఊపిరితిత్తులపై ఎంజైమ్-II (ఏసీఈ-2)గా మార్చే యాంజియోటెన్సిన్ స్థాయిలు అధికంగా ఉన్నాయని గుర్తించినట్లు బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు జెనిస్ లూంగ్ తెలిపారు.