తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇంటిపై విమానం కూలి ఆరుగురు మృతి - పుయెర్టో మాంట్​

చిలీలోని పుయెర్టో మాంట్​ నగరంలో ఒక ఇంటిపై చిన్న విమానం కూలింది. అందులోనున్న మొత్తం ఆరుగురు మరణించారు.

ఇంటిపై విమానం కూలి ఆరుగురు మృతి

By

Published : Apr 17, 2019, 10:15 AM IST

Updated : Apr 17, 2019, 12:22 PM IST

ఇంటిపై విమానం కూలి ఆరుగురు మృతి

చిలీ తీరప్రాంత నగరం పుయెర్టో మాంట్​ నగరంలో ఓ ఇంటిపై చిన్న విమానం కూలింది. పైలట్​తో సహా విమానంలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పారు.

విమానం వెనుకభాగం ఇంటిలోకి చొచ్చుకొని వెళ్లింది. ఇల్లు స్వల్పంగా దెబ్బతింది.

విమానం అర్చిపెలిగోస్​ కంపెనీకి చెందినదిగా అధికారులు గుర్తించారు. విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికే కూలిపోయిందని, ట్యాంకు నిండా ఇంధనం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Last Updated : Apr 17, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details