అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫ్లోరిడా నావల్ బేస్‌లో సౌదీ అరేబియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అధికారి జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పెన్సకోలా నావల్‌ఎయిర్‌స్టేషన్‌లోని ఓ తరగతి గదిలోకి తుపాకీతో ప్రవేశించిన సౌదీ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 8 మంది గాయపడ్డారు. నావల్‌బేస్ అధికారులు జరిపిన ఎదురు కాల్పుల్లో సౌదీ అధికారి చనిపోయాడు. కాల్పుల ఘటన నేపథ్యంలో నావల్ బేస్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
ప్రపంచ దేశాల సైనికులు..
ప్రపంచదేశాలకు చెందిన సైనికులు పెన్సకోలా నావల్ ఎయిర్‌స్టేషన్‌లో విమానశిక్షణ కోసం హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ కోసం వచ్చిన సౌదీ అరేబియా ఎయిర్‌ఫోర్స్ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల వెనుక తీవ్రవాద కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రంప్ విచారం