తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రస్తుతం మనల్ని రక్షించేది వ్యాక్సిన్​ మాత్రమే'

అమెరికాలో ఉన్న భారతీయ వైద్యుల్లో చాలా మంది కరోనా వ్యాక్సిన్​ను తీసుకుంటున్నారు. అంతేకాక టీకా వేసుకోమని ఇతరులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని రక్షించేది వ్యాక్సిన్​ మాత్రమేనని వారు సూచిస్తున్నారు. ఫైజర్-బయోఎన్​టెక్, మోడెర్నా టీకాలను గతవారం నుంచి అమెరికాలో ఇస్తున్నారు.

Several Indian-American physicians publicly take COVID-19 vaccine, encourage others to get it
'ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని రక్షించేది వ్యాక్సిన్​ మాత్రమే'

By

Published : Dec 22, 2020, 8:13 PM IST

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజల్ని కాపాడగలిగేది వ్యాక్సిన్​ మాత్రమేనని అమెరికాలోని భారతీయ వైద్యులు అంటున్నారు. వీరందరూ బహిరంగంగా కరోనా వ్యాక్సిన్​ తీసుకుంటున్నారు. టీకా తీసుకోవాలని ఇతరులనూ ప్రోత్సహిస్తున్నారు. గతవారం నుంచి అమెరికాలోఫైజర్-బయోఎన్​టెక్, మోడెర్నా టీకాలను వేస్తున్నారు.

మొహమాటం వద్దు

అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఫిజీషియన్స్​(ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు డాక్టర్​ సురేశ్ రెడ్డి తెలిపారు. టీకా బాగా పనిచేస్తుందని, సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని రక్షించేది వ్యాక్సిన్ మాత్రమే​ అని అన్నారు. టీకా తీసుకోవటానికి ఎవరికీ మొహమాటం, సిగ్గు అవసరం లేదని తెలిపారు. సాంకేతికత, నిపుణులైన వైద్యుల వల్లే వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వచ్చిందన్నారు.

టీకా వచ్చినా నిబంధనలు మానొద్దు

కొవిడ్​-19ను అంతం చేయాలంటే వ్యాక్సిన్​ తీసుకోవాల్సిందేనని టెక్సాస్​ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్​ జయేశ్​ షా తెలిపారు. 70 శాతం మంది కరోనా టీకా తీసుకుంటే.. హెర్డ్ ఇమ్యూనిటీ తయారయ్యేందుకు దోహదం చేస్తుందని వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిబంధనలు పాటించటం మానొద్దని సూచించారు. భౌతిక దూరం పాటించటం, చేతులు కడుక్కోవటం, మాస్కు ధరించటం తప్పనిసరి అన్నారు.

ఫైజర్-బయోఎన్​టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​కు​.. ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల డోసులు ఇవ్వగల సామర్థ్యం ఉంది. 2021 చివరి వరకు 1.3 బిలియన్​ డోసులు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ చివరి నాటికి దాదాపు 20 మిలియన్ల డోసులు అందిస్తామని మోడెర్నా సంస్థ తెలిపింది. 2021 ప్రథమార్థం నాటికి 100-125 మిలియన్ల డోసులను అందిస్తామని వివరించింది.

జాన్​ హోప్​కిన్స్​ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం.. సోమవారానికి అమెరికాలో కరోనా కేసుల సంఖ్య కోటి 80 లక్షలు దాటింది.

ఇదీ చదవండి :'6 వారాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్‌కు టీకా!'

ABOUT THE AUTHOR

...view details