తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాన్​పై ట్రంప్​ సైనికాధికారాలకు సెనేట్​ అడ్డుకట్ట!

ఇరాన్​కు వ్యతిరేకంగా చేపట్టే సైనిక చర్యలకు కాంగ్రెస్​ ఆమోదం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన తీర్మానానికి అమెరికా ఎగువసభ ఆమోదం తెలిపింది. తీర్మానానికి మద్దతుగా అధికార రిపబ్లికన్​ పార్టీకి చెందిని ఎనిమిది మంది సభ్యులు ఓటు వేయటం వల్ల 55-45 మెజారిటీతో నెగ్గింది.

Senate acts to restrain Trump's military powers against Iran
ట్రంప్​ సైనికాధికారాలకు అమెరికా సెనేట్​ అడ్డుకట్టు

By

Published : Feb 14, 2020, 9:38 AM IST

Updated : Mar 1, 2020, 7:26 AM IST

ఇరాన్​పై ట్రంప్​ సైనికాధికారాలకు సెనేట్​ అడ్డుకట్ట!

ఇరాన్​పై సైనిక చర్యలను చేపట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు ఉన్న అధికారాలకు అడ్డుకట్టు వేసింది అమెరికా ఎగువసభ సెనేట్​. ఇరాన్​కు వ్యతిరేకంగా చేపట్టబోయే చర్యలకు కాంగ్రెస్​ ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపింది. సెనేట్​లో జరిగిన ఓటింగ్​లో అధ్యక్షుడి పార్టీ రిపబ్లికన్​కు చెందిన ఎనిమిది మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో 55-45 ఓట్లతో తీర్మానానికి ఆమోదం లభించింది.

సైనిక చర్యలకు కాంగ్రెస్​ ఆమోదం కోసం సెన్​ టిమ్​ కేయిన్​ తీసుకొచ్చిన తీర్మానం.. ఈనెల చివర్లో కాంగ్రెస్​ ప్రతినిధుల సభకు చేరనుంది. ట్రంప్​ వీటో అధికారాన్ని అడ్డుకోవడానకి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమవుతుంది.

కాంగ్రెస్​ అధికారాన్ని సూచిస్తుంది..

కాంగ్రెస్​ ఆమోదాన్ని పొందిన తర్వాతే ట్రంప్..​ ఇరాన్​కు వ్యతిరేకంగా సైనిక చర్యలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు సెన్​ టిమ్​ కేయిన్​. ఈ తీర్మానం ట్రంప్​, అధ్యక్ష పదవి గురించి కాదని.. యుద్ధాన్ని ప్రకటించడానికి కాంగ్రెస్​కే సర్వాధికారాలు ఉన్నాయని తెలపడానికేనని పునరుద్ఘాటించారు. అయితే.. ఈ నిర్ణయం అగ్రరాజ్య బలహీనతగా ఇరాన్​కు సందేశమవుతుందన్న ప్రశ్నకు బదులిచ్చారు కేయిన్​. ఈ నిర్ణయం ప్రాథమికమైనదని.. మనకు ఉన్న నియమాలు పాటించాలన్నారు. వాటి ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చని.. అది మనకు ఉన్న బలాన్ని సూచిస్తుందని స్పష్టం చేశారు.

ట్రంప్​ విమర్శలు..

అధ్యక్షుడికి ఉన్న ప్రత్యేక సైనికాధికారాలను నియంత్రించేందుకు తీర్మానం చేయటంపై విమర్శలు చేశారు ట్రంప్​. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేయిన్​ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని గత బుధవారం వరుస ట్వీట్లు చేశారు. ఇరాన్​ టాప్​ కమాండర్​ జనరల్​ ఖాసీం సులెమానీని మట్టుబెట్టడాన్ని పేర్కొన్నారు. ఇరాన్​ విషయంలో సరనై నిర్ణయమే తీసుకున్నామని.. ఇది మన బలహీనతను చూపాల్సిన సమయం కాదని పేర్కొన్నారు.

ట్రంప్​ ట్వీట్​

ఇదీ చూడండి:వాలంటైన్స్​ ప్రత్యేకం: బహుమతులపై భారీ తగ్గింపు

Last Updated : Mar 1, 2020, 7:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details