తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎలుగుబంటిని తరిమికొట్టిన శునకం! - కుక్క

ఇంట్లోకి వచ్చిన ఓ ఎలుగుబంటిని... కాపలా కాస్తున్న శునకం తరిమి తరిమి కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన అమెరికా న్యూజెర్సీలోని... హెవిట్​లో జరిగింది.

ఎలుగుబంటిని తరిమికొట్టిన శునకం!

By

Published : Jul 12, 2019, 6:09 AM IST

Updated : Jul 12, 2019, 7:41 AM IST

కుందేళ్లు వేటకుక్కలను వెంబడించాయని విజయనగర చరిత్రలో చదువుకున్నాం. మరి ఓ కుక్క ... ఎలుగుబంటిని తరిమిన ఘటన గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ దృశ్యాలు చూశారా?

ఎలుగుబంటిని తరిమికొట్టిన శునకం!

అమెరికా న్యూజెర్సీ... హెవిట్​ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి నల్లని ఎలుగుబంటి ప్రవేశించింది. అక్కడ ఉన్న ఓ ఫీడర్​ను పడగొట్టి అందులోని పక్షుల ఆహారాన్ని తినడం మొదలుపెట్టింది. అది గమనించిన పక్కింట్లోని కాపలా కుక్క... ఒక్కసారిగా ఎలుగుబంటిపైకి దూకింది. హతాశురాలైన భల్లూకాన్ని తరిమితరిమి కొట్టింది. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

న్యూజెర్సీకి చెందిన మార్క్​ స్టిన్జియానో ఈ వీడియోను తన ఫేస్​బుక్​ పేజీలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్​ అయ్యింది.

"మా పొరుగువారి కుక్కకు నేను మాంసపు విందు భోజనం వడ్డిస్తాను. అది ఓ అద్భుతమైన శునకం. ఎప్పటికప్పుడు మా పిల్లలు ఎలా ఉన్నారో అని వచ్చి చూస్తుంటుంది. వారిని భద్రంగా కాపాడుతోంది. మీరు చూస్తున్న ఈ వీడియో మా పెరట్లోనే జరిగింది. రిలే -1, ఎలుగుబంటి-0 స్కోర్ సాధించాయి."- మార్క్​ స్టిన్జియానో

ఇదీ చూడండి: వాణిజ్య వివాదాలపై నేడు భారత్-అమెరికా చర్చలు

Last Updated : Jul 12, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details