గల్ఫ్ తీరంలో బ్రిటన్కు చెందిన రెండు ట్యాంకర్లను ఇరాన్ అదుపులోకి తీసుకోవడం... ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఇరాన్ చర్యను ఖండించిన యూకే.. ఇది ఏ మాత్రం 'ఆమోదయోగ్యం కాదని' పేర్కొంది.
బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్.. ఇరాన్ చర్యలను ఖండించారు. తమ దేశానికి చెందిన రెండు నౌకలను ఇరాన్ అదుపులోకి తీసుకోవడం ఏమాత్రం ఆమోదం కాదని వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఆందోళనకరమైనదని ఆయన పేర్కొన్నారు.
'బయలుదేరడానికి సిద్ధంగా ఉంది'
ఇరాన్... రెండు బ్రిటన్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంది. అయితే వీటిలోని రెండో ట్యాంకర్ను ప్రస్తుతం విడిచిపెట్టిందని, ఒక ఓడ బయలు దేరడానికి సిద్ధంగా ఉందని యజమాని వెల్లడించారు.