తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ జూలోని గొరిల్లాలకు కరోనా టీకా - శాన్​డియాగో జూ

అమెరికాలోని శాన్​డియాగో జూలో కరోనా బారిన పడిన గొరిల్లాలకు టీకా అందించారు. గతంలో వీటిలో కొన్ని కరోనా బారిన పడగా.. ప్రత్యేక చికిత్స అందించారు.

san diego zoo gorillas got corona vaccine
అమెరికాలోని జూలో గొరిల్లాలకు కరోనా టీకా

By

Published : Mar 7, 2021, 3:00 PM IST

అమెరికాలోని శాన్​డియాగో జంతు సంరక్షణ కేంద్రంలో కరోనా సోకిన గొరిల్లాలకు టీకా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంతరించిపోతున్న గొరిల్లా, చింపాజీల సంరక్షణలో శాన్​డియాగో జూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

కరోనా టీకా తీసుకున్న వాటిలో నాలుగు ఒరంగుఠాన్​లు, ఐదు బొనొబొలు ఉన్నాయని జూ అధికారులు తెలిపారు. గత జనవరిలో వీటికి కరోనా సోకగా.. ప్రత్యేక చికిత్స అందించి వాటిని కాపాడారు. అప్పట్లో జూ సిబ్బందికి కరోనా సోకగా.. వీరి ద్వారా ఈ జంతువులు మహమ్మారి బారిన పడ్డాయి.

ప్రస్తుతం వీటి పరిస్థితి బాగానే ఉందని.. దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నాయని జూ అధికారులు తెలిపారు. ఈ జూలోని జంతువుల పరిస్థితి బాగానే ఉందని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ విభాగం(సీడీసీ) తెలిపింది.

ఇదీ చదవండి:అమెరికా 'జూ'లో గొరిల్లాలకు కరోనా

ABOUT THE AUTHOR

...view details