తెలంగాణ

telangana

అమెరికా నిఘా విమానాలను అడ్డుకున్న రష్యా

By

Published : Jun 28, 2020, 4:13 AM IST

తమ సరిహద్దుల్లోకి నల్ల సముద్రం మీదుగా ప్రవేశించేందుకు యత్నించిన అమెరికా నిఘా విమానాలను తిప్పికొట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. అమెరికాకు చెందిన ఆర్​సీ-135 నిఘా విమానం, పి-8 పోసిడాన్​, కేసీ-135లను... తమ దేశానికి చెందిన ఎస్​యూ-30 యుద్ధవిమానం వెనక్కు మరిలేలా చేసిందని పేర్కొంది. దీనికి సాక్ష్యంగా ఓ వీడియో ఫుటేజీని కూడా విడుదల చేసింది.

Russia intercepts US 'spy planes' over Black Sea
అమెరికా నిఘా విమానాలను అడ్డుకున్న రష్యా

నల్ల సముద్రం మీదుగా తమ సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మూడు అమెరికా నిఘా విమానాలను తిప్పికొట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీనికి సాక్ష్యంగా ఓ వీడియో ఫుటేజీని కూడా విడుదల చేసింది.

అమెరికాకు చెందిన ఆర్​సీ-135 నిఘా విమానం, పి-8 పోసిడాన్​, కేసీ-135 (గాలిలోనే ఇంధనం నింపే విమానం) అనే మూడు విమానాలు నల్ల సముద్రం తటస్థ జలాల మీదుగా తమ దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయని రష్యా రక్షణశాఖ అధికారులు తెలిపారు. అయితే వాటిని తమ ఎస్​యూ-30 యుద్ధ విమానం సరిహద్దుల వరకు తరిమికొట్టిందని వెల్లడించారు. ఈ విషయంలో రష్యా యుద్ధ విమానం... అన్ని అంతర్జాతీయ భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించిందని స్పష్టం చేశారు.

రివర్స్​

రష్యా ప్రకటనపై యూఎస్ మిలటరీ భిన్నంగా స్పందించింది. బుధవారం నాడు రెండు రష్యా యుద్ధవిమానాలు అలస్కాలోని యునిమాక్ ద్వీపంలోకి 80 కి.మీ మేర చొచ్చుకువచ్చాయని... అయితే వాటిని తమ 'ఎఫ్​ 22' యుద్ధవిమానాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. రష్యా విమానాలను ఇలా అడ్డుకోవడం ఈ నెలలో ఇది ఐదోసారి అని పేర్కొంది.

రష్యా విమానాలను అడ్డుకున్న యూఎస్ యుద్ధవిమానాలు

2007లో రష్యా సుదూర విమానయాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తరువాత.. సంవత్సరానికి సగటున 7 సార్లు ఆ దేశ యుద్ధవిమానాలు తమ సరిహద్దుల్లోకి వస్తుంటాయని యూఎస్ మిలటరీ తెలిపింది. అయితే ఏ సంవత్సరంలోనైనా ఈ సంఖ్య 0 నుంచి 15 వరకు ఉంటుందని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ పేర్కొంది.

ఇదీ చూడండి:ఆ చైనా కంపెనీలతో జాగ్రత్త.. అమెరికా హెచ్చరిక!

ABOUT THE AUTHOR

...view details