పరిపాలనా విభాగంలోని ముస్లిం అధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలకు రంజాన్ మాసం సందర్భంగా శ్వేతసౌధంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రంజాన్ మాసం దయ, దానం, సేవలు చేసే సమయమని చెప్పారు. కుటుంబాన్ని, సన్నిహితులను రంజాన్ దగ్గర చేస్తుందని అభిప్రాయపడ్డారు ట్రంప్.
"శాంతి, సహనం, ఆకాంక్షలను కొనసాగించేందుకు ప్రజలు ఐక్యమయ్యే సమయమే రంజాన్. అదే స్ఫూర్తితో అందరం కలిసి ఈ సమయంలో ఇఫ్తార్ కోసం కలిశాం. న్యూజిలాండ్ మసీదుల్లో జరిగిన దాడుల్లో మృతి చెందిన ముస్లింల పట్ల అందరి హృదయాలు బాధతో నిండాయి. అలాగే శ్రీలంక, కాలిఫోర్నియా, పిట్స్బర్గ్లో జరిగిన దాడుల్లో క్రైస్తవులు, యూదులు చనిపోవడం విచారకరం."