రెండు రోజుల పాటు బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. చాలా ఫలవంతంగా పర్యటన సాగిందని అభిప్రాయపడ్డారు మోదీ.
'బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సదస్సు అత్యంత ఫలవంతంగా సాగింది. వాణిజ్యం, సృజనాత్మకత, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో సహకారం దిశగా ఫలవంతమైన చర్చ జరిగింది. సభ్య దేశాల్లో ప్రజా సంక్షేమం దిశగా మరింత బలమైన సహకారం పెంపుపై ఈ సమావేశం దృష్టి సారించింద'ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు మోదీ.