అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌తో దాడికి ప్రయత్నించాడు. ఇండియానాపొలిస్ జాతీయ రైఫిల్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడేందుకు పోడియం వద్దకు వస్తున్నారు ట్రంప్. ఇంతలో వేదిక కింద ఉన్న ఓ వ్యక్తి హఠాత్తుగా తన చరవాణిని డొనాల్డ్‌పై విసిరాడు.
ట్రంప్‌పై 'ఫోన్' దాడికి యత్నం.. కొద్దిలో మిస్ - ఫోన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఓ వ్యక్తి సెల్‌ఫోన్ విసిరేశాడు. ఇండియానాపొలిస్‌లో జరిగిన జాతీయ రైఫిల్ అసోసియేషన్ సమావేశంలో ఈ ఘటన జరిగింది.
ట్రంప్
ఫోన్ ట్రంప్‌కు తగలకుండా దూరంగా వేదికపై పడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని బయటకు పంపేశారు. ట్రంప్ ఉపన్యాసం కొనసాగించారు. అధ్యక్షుడు మాట్లాడినంతసేపు వేదికపైనే ఉంది ఆ చరవాణి.
సెల్‌ఫోన్ విసిరేసిన వ్యక్తి ట్రంప్ మద్దతుదారుడిగానే కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.