తెలంగాణ

telangana

ETV Bharat / international

నిత్యావసరాల కోసం బారులు తీరిన కార్లు

అమెరికాలో కరోనా నివారణకు పలు ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో... ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఫుడ్​ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. లాస్​ ఏంజిల్స్​లో ప్రజలు నిత్యావసర సరకుల కోసం తమ కార్లలోనే కిలోమీటర్ల దూరం వరకు బారులు తీరారు.

People lining up for groceries in Los Angeles, USA
నిత్యావసరాల కోసం బారులు తీరిన కార్లు!

By

Published : Apr 11, 2020, 10:47 AM IST

నిత్యావసర వస్తువులు కోసం ప్రజలు తమ కార్లలో కిలోమీటర్ల దూరం వరకు బారులు తీరిన దృశ్యం యూఎస్​లోని లాస్ ఏంజిల్స్​లో ఆవిష్కృతమైంది.

నిత్యావసరాల కోసం బారులు తీరిన కార్లు!

కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ... అధికారులు ఇంగిల్​వుడ్​లో ఫుడ్​ బ్యాంకును ఏర్పాటు చేశారు. సుమారు 5,000 కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడానికి ఏర్పాట్లు చేశారు.

ప్రజలు కిరాణా సామగ్రి కోసం తమ కార్లలోనే కిలోమీటర్ల దూరం వరకు బారులు తీరారు. అయితే వారు బయటకు రావాల్సిన అవసరం లేకుండానే వలంటీర్లే స్వయంగా కిరాణా సామగ్రిని కార్లలో పెట్టారు.

నిత్యావసరాలకు డిమాండ్​

కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఆలస్యంగా మేల్కొన్న అగ్రరాజ్యం అంటువ్యాధి నివారణ కోసం పలు ఆంక్షలు అమలుచేస్తోంది. ఫలితంగా నిత్యావసర సరకులకు డిమాండ్ పెరిగింది.

ఇదీ చూడండి:కరోనా సాకుతో ఉద్యోగుల్ని తీసేయొచ్చా? చట్టంలో ఏముంది?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details