తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకలం-పోలీసు మృతి - పెంటగాన్ కాల్పులు

The Pentagon is on lockdown after multiple gunshots
అమెరికా పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకలం

By

Published : Aug 3, 2021, 8:42 PM IST

Updated : Aug 4, 2021, 12:48 AM IST

20:37 August 03

అమెరికా పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకలం

అమెరికా రక్షణ శాఖ భవన సముదాయం.. పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకలం రేగింది. మెట్రోస్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో కత్తిపోట్లకు గురైన ఓ పోలీసు అధికారి ప్రాణాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. ఇదే ఘటనలో పోలీసు కాల్పుల్లో ఓ అనుమానితుడు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పెంటగాన్ వద్ద కొద్దిసేపు లాక్​డౌన్ విధించారు. మెట్రో సబ్​వే రైళ్లను దారిమళ్లించారు. పెంటగాన్ సమీపంలో జరిగిన హింసాకాండలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

లాక్​డౌన్ విషయాన్ని పెంటగాన్ ధ్రువీకరించింది. పోలీసు చర్య కారణంగా ఆంక్షలు విధించినట్లు తెలిపింది. అనంతరం కాసేపటికి లాక్​డౌన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. 

పెంటగాన్ ప్రయాణ కేంద్రంలోని మెట్రో బస్ ప్లాట్​ఫాం వద్ద ఈ ఘటన జరిగినట్లు భద్రతా అధికారులు తెలిపారు. పెంటగాన్​ భవనానికి ఇది సమీపంలోనే ఉంది. పలువురు బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు అర్లింగ్టన్ కౌంటీ ఫైర్ డిపార్ట్​మెంట్ తెలిపింది. అయితే వీరు బుల్లెట్లు తగలడం వల్లే గాయపడ్డారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

తమ రిపోర్టర్ ఒకరు కాల్పుల శబ్దాన్ని విన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్​ వెల్లడించింది. కొద్దిసేపు తర్వాత మరోసారి కాల్పులు జరిగినట్లు తెలిపింది. పోలీసులు 'షూటర్' అంటూ అరవడాన్ని మరో జర్నలిస్ట్ విన్నారని పేర్కొంది.

Last Updated : Aug 4, 2021, 12:48 AM IST

ABOUT THE AUTHOR

...view details