తెలంగాణ

telangana

ETV Bharat / international

'డెల్టా కంటే ఒమిక్రాన్ డేంజర్.. డబ్లింగ్ రేటు రెండు రోజులే'

Omicron doubling time: ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు రెండు రోజులుగా ఉందని అమెరికా సీడీసీ డైరెక్టర్ రొషెల్ వాలెన్స్కీ వెల్లడించారు. ఇప్పటికే 75 దేశాల్లో వైరస్ కేసులు బయటపడ్డాయని తెలిపారు. అయితే, దేశంలో లాక్​డౌన్ విధించాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది.

US COVID SURGE
US COVID SURGE

By

Published : Dec 16, 2021, 7:54 AM IST

Omicron doubling time: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి డెల్టా కంటే తీవ్రంగా ఉందని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) డైరెక్టర్ రొషెల్ వాలెన్స్కీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్ కేసులు రెండు రోజులకు ఒకసారి రెట్టింపు (డబ్లింగ్ రేటు) అవుతున్నాయని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ 75 దేశాలకు విస్తరించిందని, అమెరికాలో కనీసం 36 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయని వివరించారు. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ వివరాలను సీడీసీ ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు.

Omicron Lockdown in US

అమెరికాలో ఇప్పటికే డెల్టా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. అయితే, దేశంలో లాక్​డౌన్​ పెట్టాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం బుధవారం స్పష్టం చేసింది. తగినన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయని, ఇవి వైరస్​ తీవ్రతను తగ్గిస్తాయని పేర్కొంది.

US covid cases

ఈ వేరియంట్​తో ఆస్పత్రుల్లో చేరే కొవిడ్ బాధితుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 'డెల్టా ఉద్ధృతి తీవ్రంగానే ఉంది. నిజానికి ఇంకా పెరుగుతోంది కూడా. దీనికి అదనంగా ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్పత్రులు ఇప్పటికే నిండిపోయాయి. సిబ్బంది అలసిపోయారు,' అని చెప్పారు.

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో విద్యాసంస్థలు మళ్లీ ఆన్​లైన్ క్లాసులకు మరలుతున్నాయి. పలు కళాశాలలు మాస్కులు, బూస్టర్ డోసులు తప్పనిసరి అన్న నిబంధనను తీసుకొచ్చాయి. క్యాంపస్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ కార్నెల్ యూనివర్సిటీ ప్రకటించింది. ఫైనల్ ఎగ్జామ్స్​ను ఆన్​లైన్ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మరిన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సైతం ఆన్​లైన్ బాటపడుతున్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details