తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా వల్ల నష్టపోవడాన్ని కొనసాగనివ్వను :ట్రంప్​ - జిన్పింగ్​

చైనా వల్ల తమ దేశం వాణిజ్య రంగంలో ఏటా 500 బిలియన్ డాలర్లను కోల్పోతోందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తెలిపారు. ఇకపై ఇలా జరగనివ్వబోమని తెలిపారు. రేపు ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చైనా వల్ల నష్టపోవడాన్ని కొనసాగనివ్వను : ట్రంప్​

By

Published : May 7, 2019, 5:32 AM IST

చైనా వల్ల నష్టపోవడాన్ని కొనసాగనివ్వను : ట్రంప్​

చైనా వల్ల వాణిజ్య రంగంలో తమ దేశం ఏటా 500 బిలియన్​ డాలర్లు నష్టపోతోందని, ఇకపై అలా జరగనివ్వబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ స్పష్టం చేశారు.​

"అమెరికా చాలా ఏళ్లుగా వాణిజ్యంలో ఏడాదికి 600 నుంచి 800 బిలియన్​ డాలర్లు నష్టపోతోంది. చైనా వల్లనే 500 బిలియన్​ డాలర్లు కోల్పోతున్నాం. ఇకపై మేము అలా జరగనివ్వం. చైనా ఎగుమతులపై విధిస్తున్న 10 శాతం పన్నులు శుక్రవారం నుంచి 25 శాతానికి చేరుకుంటాయి. 325 బిలియన్​ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై ఇంకా ఎలాంటి పన్నులు లేవు. అయితే త్వరలోనే వాటిపై పన్నులు 25శాతానికి చేరుకుంటాయి."- డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

వాణిజ్య చర్చలను ఉద్దేశపూర్వకంగా చైనా ఆలస్యం చేస్తోందని ట్రంప్​ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుస ట్వీట్లతో డ్రాగన్​ దేశంపై ఆయన విరుచుకుపడుతున్నారు.

అందుకే చర్చలు ఆలస్యం

అమెరికాతో కీలకమైన వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్​కు వెళ్లడానికి తమ వాణిజ్య ప్రతినిధి సిద్ధమవుతున్నారని చైనా అధికార ప్రతినిధి తెలిపారు. అయితే చైనా ఉత్పత్తులపై ట్రంప్​ ప్రభుత్వం అదనంగా 200 బిలియన్ డాలర్ల పన్నులు విధించిందని, అందుకే వాణిజ్య చర్చల పురోగతి నెమ్మదించిందని తెలిపారు.

' వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో సంప్రదింపులకు చైనా మళ్లీ ప్రయత్నిస్తున్నందున చర్చలు కొనసాగుతున్నాయి. కానీ చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ట్వీట్​ చేశారు. ఈ నేపథ్యంలోనే చైనా ఉపాధ్యక్షుడు లి హీ.. అమెరికాతో జరగాల్సిన చివరి దఫా వాణిజ్య చర్చలను రద్దు చేసుకున్నారని కొన్ని అమెరికా వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఇదీ చూడండి: బ్రిటన్​ యువరాజు నివాసంలో బుడిబుడి అడుగులు

ABOUT THE AUTHOR

...view details