అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఆయనకు రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని తెలిపాయి. ట్రంప్ వైరస్ బారిన పడిన తర్వాత 24 గంటల పాటు ముఖ్యమైన అవయవాలు కలవరపెట్టినట్లు వివరించాయి.
అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 24 గంటల్లో ఆయనకు జ్వరం కూడా లేదని వెల్లడించారు. ప్రస్తుతం కొద్దిగా దగ్గు, ముక్కు దిబ్బడతో బాధ పడుతున్నారని.. అలసటగా ఉన్నారని ట్రంప్ వైద్యుడు సీన్ కాన్లీ ప్రకటించారు. ఈ సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు.