తెలంగాణ

telangana

ETV Bharat / international

2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్​ వెనుకంజ! - అధ్యక్ష ఎన్నికలు

2020లో జరగనున్న అమెరికా ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వెనకబడ్డారని ఫాక్స్ న్యూస్ ప్రకటించింది. తాము నిర్వహించిన నమూనా పోల్​ జాబితాలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వ పోటీలో ఉన్న జో బిడెన్ మొదటి స్థానంలో నిలిచారని వెల్లడించింది.

అధ్యక్ష ఎన్నిక ప్రచారంలో వెనకబడిన ట్రంప్!

By

Published : Jun 17, 2019, 8:42 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వెనకబడ్డారని తేల్చింది ఫాక్స్​ న్యూస్. ఈ సర్వేలో జో బిడెన్​కు డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారని వెల్లడించింది.2020 అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా 500 రోజుల ముందు ఈ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. జూన్ 9 నుంచి 12 మధ్య ఈ సర్వే నిర్వహించారు.

ఫాక్స్ న్యూస్ పోలింగ్​లో జో బిడెన్​కు 49 శాతం ఓట్లు లభించగా, ట్రంప్​కు 39 శాతం ఓట్లు లభించాయి.

సెనేటర్ బెర్నీ సాండర్స్​కూ 49 శాతం ఓటింగ్ లభించింది. సెనేటర్లు ఎలిజబెత్ వార్రెన్, కమలా హారిస్​, ఇండియానా రాష్ట్రంలోని సౌత్ బెండ్ మేయర్ పీట్ బట్టిగీగ్​లూ డొనాల్డ్​తో పోల్చితే కొంత మెరుగైన ఫలితాలు సాధించారు.

ఇప్పటివరకు ట్రంప్ అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. మంగళవారం ఫ్లోరిడాలోని ఓర్నాల్డో వేదికగా ప్రచార శంఖారావం పూరించనున్నారు ట్రంప్.

ఇదీ చూడండి: టార్గెట్​ యూపీ... ప్రియాంక వ్యూహం ఫలించేనా?

ABOUT THE AUTHOR

...view details