తక్కువ ధరలో వేగంగా, కచ్చితత్వంతో చేసే కరోనా నిర్ధరణ పరీక్షను అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ బృందం అభివృద్ధి చేసింది. వైరస్ నిర్ధరణ కోసం పెన్సిల్ లెడ్‌లో వాడే గ్రాఫైట్‌తో తయారు చేసిన ఎలక్ట్రోడ్లను ఉపయోగించనున్నారు. ఆరున్నర నిమిషాల్లో ఒకటిన్నర డాలర్లతోనే పరీక్ష చేయవచ్చని అమెరికాకు చెందిన.. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పత్రిక తెలిపింది.
పెన్సిల్ లెడ్తో కరోనా పరీక్షలు- మరింత చౌకగా! - పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం
చౌక ధరలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసే విధానాన్ని కనుగొన్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. దానికోసం పెన్సిల్ లెడ్‌లో వాడే గ్రాఫైట్‌తో తయారు చేసిన ఎలక్ట్రోడ్లను ఉపయోగించనున్నట్లు తెలిపారు.
కరోనా
ఈ విధానంలో నోటి నుంచి చేసే పరీక్ష వందశాతం, ముక్కు నుంచి చేసే పరీక్ష 88 శాతం విజయవంతమైనట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ బృందం గతంలోనే కరోనా నిర్ధరణ పరీక్షను అభివృద్ధి చేయగా.. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో దాన్ని తయారుచేసింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామని, దీనికోసం మరిన్ని క్లినికల్ అధ్యయనాలు చేయాలని వారు తెలిపారు.
ఇదీ చూడండి:వుహాన్‌లో కోటి మందికి కరోనా పరీక్షలు