తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా: భానుడి భగభగలు- ప్రజలు ఉక్కిరిబిక్కిరి

భారీ ఉష్ణోగ్రతలకు అమెరికా ప్రజలు విలవిలలాడుతున్నారు. న్యూయార్క్​, వాషింగ్టన్​ సహా పలు ప్రాంతాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. న్యూయార్క్​లో 500 ఉపసమన కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

By

Published : Jul 21, 2019, 10:21 AM IST

Updated : Jul 21, 2019, 10:57 AM IST

అమెరికాలో భానుడి భగభగలు- ప్రజలు ఉక్కిరిబిక్కిరి

న్యూయార్క్​వాసుల పరిస్థితి

భానుడి భగభగలకు అమెరికా అల్లాడిపోతోంది. న్యూయార్క్​, వాషింగ్టన్​, ఫిలడెల్ఫియా సహా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను తాకుతున్నాయి. ఎండల ధాటికి ఈ వారంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేడి గాలులకు దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల​ మంది ఉక్కిరిబిక్కరి అవుతున్నారు.

భారీ ఉష్ణోగ్రతలు, తేమ నుంచి తగిన రక్షణ పొందకపోతే వడదెబ్బ తగిలే అవకాశముందని ఆ దేశ జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారమూ భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని స్పష్టం చేసింది.

న్యూయార్క్​ విలవిల...

న్యూయార్క్​లో 500 ఉపసమన కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఎండల భయానికి న్యూయార్క్​లో ఆదివారం జరగాల్సిన 'ట్రైయాత్లాన్'​ వేడుకను అధికారులు రద్దు చేశారు. అలానే సెంట్రల్​ పార్క్​లో ఏర్పాటు చేసిన ఫుడ్​ ఫెస్ట్​, మ్యూజిక్​ ఈవెంట్​నూ నిలిపివేశారు.

ఫిలడెల్ఫియాలో శనివారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1930 అనంతరం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి:- ఆరేళ్ల లిటిల్​ కోచ్​కు కోపమొస్తే...?

Last Updated : Jul 21, 2019, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details