అక్రమ వలసల నియంత్రణపై మెక్సికోతో ఒప్పందం కుదిరిందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యానికి మెక్సికో నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు పెంచబోమని చెప్పారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు.
"మెక్సికోతో అమెరికా అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం నుంచి ఆ దేశ వస్తువులపై విధించాలనుకున్న సంకాల పెంపును విరమించుకుంటున్నాం. అమెరికా దక్షిణ సరిహద్దు ద్వారా వలసలను నియంత్రించేందుకు మెక్సికో చర్యలు చేపడతామని తెలిపింది. అక్రమ వలసల కట్టడికి ఇది దోహదపడుతుంది. ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. "
-డొనాల్డ్ ట్రంప్ ట్వీట్.