అంగారకుడి ఉపరితలం చిత్రాలను పంపిన రోవర్ అంగారకుడిపై దిగిన పర్సెవరెన్స్ రోవర్ పంపిన అంగారక గ్రహ ఉపరితల చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. రోవర్ ల్యాండ్ అయిన 24 గంటలకు ఈ చిత్రాలు బయటకు వచ్చాయి. 25 కెమేరాలు, రెండు మైక్రో ఫోన్లనతో మార్స్ మీదకి గురువారం అడుగు పెట్టిన రోవర్.. అంగారక గ్రహం ఉపరితలం ఫొటోలను పంపించింది. ఇదివరకు పంపిన క్యూరియాసిటీ రోవర్ కన్నా పర్సెవరెన్స్ పంపిన చిత్రాలు మెరుగ్గా ఉండటం వల్ల నాసా బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
రోవర్ ల్యాండ్ అయిన ప్రదేశం రోవర్ ముందు చక్రం (కుడివైపు) ఫ్రంట్ కెమేరా నుంచి తీసిన చిత్రం, మార్స్ ఉపరితలం ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని చిత్రాలు, ఆడియో రికార్డింగ్ త్వరలో విడుదల చేస్తామని నాసా స్పష్టం చేసింది. ఈ చిత్రాలను చూసి శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
"ఇది మనం ఎప్పుడూ చూడనిది. ఆ చిత్రాలు చూసి మా బృందం ఆశ్చర్యపోయింది. ఈ చిత్రాలను మేము కెమెరాలో బంధించి ప్రపంచానికి అందిస్తున్నందుకు గర్వంగా ఉంది."
-ఆరోన్ స్టెహురా, ఫ్లైట్ సిస్టమ్ ఇంజనీర్
ప్రస్తుతం రోవర్ పనితీరు అద్భుతంగా ఉందని, ఎలాంటి సమస్యలు తలెత్తలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వారం రోజుల పర్యవేక్షణ తర్వాత ఉపరితలం మీద రోవర్ తిరగడం ప్రారంభిస్తుందని వెల్లడించారు.
రోవర్ ల్యాండ్ అయిన ప్రదేశం రోవర్ ల్యాండింగ్ చిత్రించిన మార్స్ రికొనైసెన్స్ ఆర్బిటార్ రాళ్ల ద్వారా..
3 లేదా 4 వందల ఏళ్ల క్రితం కనుమరుగైపోయిందని భావిస్తున్న రివర్ డెల్టా రోవర్ ల్యాండింగ్ అయిన చోటు నుంచి మైలు దూరంలోనే ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అక్కడ రాళ్లను సేకరించడం ద్వారా అంతరించిపోయిన సూక్ష్మజీవుల గురించి ఆధారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అక్కడి రాళ్ల లక్షణం గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులో ఉండగా తీసిన చిత్రం ఇదీ చదవండి :అంగారకుడిపై నవ్య చరిత్ర!