అమెరికాలోని డిస్నీ ఐలాండ్‌లో ఓ వ్యక్తి తన క్వారంటైన్ సమయాన్ని చాలా ఆహ్లాదంగా గడపాలనుకున్నాడు. రిచర్డ్ మెక్గ్వైర్ అనే వ్యక్తి గత సోమవారం నుంచి అక్కడే ఉన్నాడు. వారం రోజులపాటు క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఆరెంజ్ కౌంటీ అధికారులు గురువారం 42 ఏళ్ల రిచర్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే తనకు పోలీసుల హెచ్చరికలు వినపడలేదని రిచర్డ్ తెలిపాడు. ప్రైవేటు ద్వీపాన్ని ఓ స్వర్గంగా అభివర్ణించిన రిచర్డ్.. అది నిషిద్ధ ప్రాంతామన్న విషయం తనకు తెలియదన్నాడు.
ఈ విషయంపై డిస్నీ భద్రతా విభాగం ప్రతినిధి స్పందించారు. రిచర్డ్ కంపెనీ బోటును వాడటం తాను చూసినట్టు తెలిపారు. డిస్నీ గేట్లు మూతపడ్డాయని, అక్రమంగా చొరబడకూడదని తెలిపేందుకు ఎన్నో బోర్డులు ఉన్నా.. రిచర్డ్ లోపలకు ప్రవేశించాడని వివరించారు. అతడిపై కేసు నమోదు చేయాలన్నారు.
1999 నుంచి ప్రజలకు డిస్నీ ఐలాండ్‌లోకి అనుమతి లేదు.