తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

అమెరికా కాలిఫోర్నియాలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు దుండగులు. ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు అక్కడి భారతీయ అమెరికన్లు.

Mahatma Gandhi statue vandalised in US
అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

By

Published : Jan 30, 2021, 11:59 AM IST

Updated : Jan 30, 2021, 12:49 PM IST

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు దుండగులు. దావిస్​ సిటీలోని సెంట్రల్​ పార్కులో ఉన్న ఈ ఆరు అడుగుల కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అక్కడి భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

భారత సర్కారు 2016లో.. 294 కేజీలతో తయారు చేసిన ఈ గాంధీజీ విగ్రహాన్ని దావిస్​ సిటీకి బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు జనవరి 28న ధ్వంసం చేసినట్లు పార్కు యాజమాన్యం తెలిపింది. ఈ చర్యపై భారత సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ధ్వంసమైన మహాత్ముడి విగ్రహం

ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం కోరింది. ఈ నీచమైన చర్యకు పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా చూడాలని సూచించింది. సాన్​ ఫ్రాన్సిస్కోలోని భారతీయ దౌత్యాధికారి కూడా మహాత్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. దావిస్​ సిటీ అధికారులను ప్రత్యేకంగా కలిసి దర్యాప్తు ముమ్మరం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన దావిస్ మేయర్.. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారని స్పష్టం చేశారు.

2016లో కొన్ని మైనారిటీ సంస్థలు, ఖలిస్థానీ సంస్థలు ఈ విగ్రహం ఏర్పాటుకు వ్యక్తిరేకంగా ర్యాలీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థలే విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:బెడిసికొడుతున్న చైనా వ్యూహం-భారత్​దే పైచేయి!

Last Updated : Jan 30, 2021, 12:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details