తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా బాధితుల ప్రవాహంతో హోటళ్లే ఆస్పత్రులు!

''మా వల్ల కావట్లేదు. ఇంకా వైద్యులు కావాలి. మేం ఎంత శ్రమిస్తున్నా రోగులను రక్షించలేకపోతున్నాం. మానసికంగా కుంగిపోతున్నాం.'' ఇది స్పెయిన్​ ఆసుపత్రిలోని ఓ నర్సు ఆవేదన. ఒక్క స్పెయిన్​లోనే కాదు.. ప్రస్తుతం కరోనాతో కుదేలవుతోన్న ప్రపంచదేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ఆసుపత్రులు లేక, సరైన వైద్య సదుపాయాలు లేక.. అల్లాడిపోతున్నాయి. కరోనా తీవ్రతకు రోగుల ప్రవాహంతో ఆసుపత్రుల సామర్థ్యం చాలట్లేదు. అమెరికా, ఐరోపా దేశాల్లోనే ఈ సమస్య అధికంగా ఉంది. మిగతా దేశాల్లో ఈ ఇబ్బంది తలెత్తకముందే మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

London hospitals facing 'tsunami' of virus patients: NHS official
కరోనా బాధితుల ప్రవాహంతో హోటళ్లే ఆస్పత్రులు!

By

Published : Mar 27, 2020, 7:50 AM IST

కరోనా బాధితుల ప్రవాహంతో హోటళ్లే ఆస్పత్రులు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోంది. ఐరోపా, అమెరికాల్లో వైరస్​ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోగులు వెల్లువలా వస్తుండటంతో ఆస్పత్రుల్లో పడకలు సరికోవడం లేదు. ఆరోగ్యం పూర్తిగా విషమించినవారిని చేర్చుకునేందుకు వైద్య సిబ్బంది ప్రాధాన్యమిస్తున్నారు. అందుబాటులో ఉన్న వెంటిలేటర్లతో వారి ప్రాణాలను నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

బ్రిటన్​లో...

యూకేలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లండన్​ ఆసుపత్రులకు బాధితులు వెల్లువెత్తుతున్నట్లు చెబుతున్నారు జాతీయ ఆరోగ్య సేవల చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ క్రిస్​ హాప్సన్​. అస్వస్థతకు గురైన రోగుల ప్రవాహం సునామీని తలపిస్తుందని చెబుతున్నారు.

హోటళ్లు ఆసుపత్రులుగా...

రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో స్పెయిన్​లో కొన్ని హోటళ్లను ఆసుపత్రులుగా మార్చారు. ప్రస్తుతం అక్కడి ఆసుపత్రుల్లో పరిస్థితులను ఓ నర్సు వివరిస్తూ 'మా వల్ల కావట్లేదు.. ఇంకా వైద్య సిబ్బంది కావాలి. మేం చాలా శ్రమిస్తున్నాం. అయినా రోగులను రక్షించలేకపోతున్నాం. వారు మరణిస్తుంటే నిస్సహాయులుగా చూడాల్సి వస్తోంది. దీంతో మానసికంగా కుంగిపోతున్నాం.' అని పేర్కొన్నారు.

తమకు తగినన్ని మాస్కులు, చేతి తొడుగులు, వ్యక్తిగత పరిరక్షణ సామగ్రిని సమకూర్చాలంటూ ఇటలీలో వైద్యులు, నర్సులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పడకల కొరత...

అమెరికాలోనూ ఆస్పత్రుల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ దేశంలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 85 వేలు దాటింది. 12 వందలకుపైగా మరణించారు. బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో న్యూయార్క్​ నగరంలోని కన్వెన్షన్​ సెంటర్​ను తాత్కాలిక ఆసుపత్రిగా మార్చారు.

ఆసుపత్రులకు పడకలు అందించేలా లూసియానాలోని హోటళ్లతో అధికారులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. షికాగో సబర్బన్​లో గతేడాది సెప్టెంబరుల్​ మూతపడ్డ 314 పడకల ఆసుపత్రిని తిరిగి తెరవాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details