తెలంగాణ

telangana

ETV Bharat / international

'నో డౌట్​... కరోనా పుట్టింది వుహాన్ ల్యాబ్​లోనే' - america allegations on china

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్​ ఉద్బవించింది చైనాలోని వువాన్​ వైరాలజీ ల్యాబ్​ నుంచేనని పునరుద్ఘాటించింది అమెరికా. డిసెంబర్​లోనే వైరస్​ గురించి చైనాకు తెలిసినా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విఫలమైందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు.

Know enough to be confident COVID-19 emerged out of Wuhan lab
'వుహాన్ ల్యాబ్​ నుంచే వైరస్ పుట్టిందని కచ్చితంగా చెప్పగలం'

By

Published : May 7, 2020, 10:56 AM IST

చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్​ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చినట్లు కచ్చితంగా చెప్పగలమన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. ఇందుకు సంబంధించిన ఆధారాలు తవ వద్ద ఉన్నాయని, ఇప్పుడే వాటిపై స్పందించలేమని ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు.

వుహాన్​ ల్యాబ్ నుంచి వైరస్​ ఉద్భవించలేదని ఎవరైనా ఆధారాలతో రుజువు చేస్తే సమ్మతమే అన్నారు పాంపియో. దీనిపై పూర్తిగా స్పష్టత రావడానికి వుహాన్​ ల్యాబ్​ను పరిశీలించేందుకు చైనా తమకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

" వుహాన్​ నుంచే వైరస్ బయటకు వచ్చిందని మాకు తెలుసు. డిసెంబర్​లోనే చైనాకు వైరస్ గురించి తెలుసు. త్వరితగతిన చర్యలు చేపట్టలేకపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విఫలమైంది. చైనా పట్ల సానుకూల వైఖరితోనే వైరస్​ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. వైరస్ ప్రమాదకరమని చెప్పిన వైద్యులను చైనా ప్రభుత్వం ఏం చేసిందో మనం చూశాం. కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే అమెరికాపై చైనా ఆరోపణలు చేసింది. "

-మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

అమెరికాపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. ఆ దేశంలో 70వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 12లక్షల మందికిపైగా పాజిటివ్​గా తేలింది.

ABOUT THE AUTHOR

...view details