తెలంగాణ

telangana

ETV Bharat / international

మామను ఎలా చంపారో ట్రంప్​కు​ చెప్పిన కిమ్! - ట్రంప్ కిమ్​ సంబంధాలు

ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​.. తన అంకుల్​ను ఎలా చంపారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చెప్పినట్లు సంచలన విషయం బయటకు వచ్చింది. ప్రముఖ పాత్రికేయుడు బాబ్​ ఉడ్​వర్డ్​ పుస్తకం 'రేజ్'లో ఈ విషయాలు ట్రంప్ తనకు చెప్పినట్లు వివరించారు. కరోనా వైరస్​ ముప్పు గురించి కూడా ట్రంప్​కు ముందే తెలుసనని పేర్కొన్నారు.

US-TRUMP-BOOK
ట్రంప్ కిమ్

By

Published : Sep 10, 2020, 12:30 PM IST

కరోనా వైరస్ ముప్పు గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు ముందే తెలుసా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ పాత్రికేయులు బాబ్​ ఉడ్​వర్డ్​. అంతేకాదు.. ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్.. తన మామయ్యను చంపిన విషయమూ ట్రంప్​కు వివరించినట్లు పేర్కొనటం సంచలనం సృష్టిస్తోంది.

ట్రంప్​తో చేసిన వరుస ఇంటర్వూల ఆధారంగా రేజ్​ అనే పుస్తకాన్ని రాశారు బాబ్​. ఇందులో వైరస్​, ఆర్థిక సంక్షోభం, జాత్యాంహకార నిరసనలపై ట్రంప్ మాట్లాడారని వివరించారు. కరోనా వైరస్​ ఎంత ప్రమాదకరమో ముందే తెలుసని ట్రంప్​ తనతో చెప్పినట్లు ఈ పుస్తకంలో రాశారు బాబ్.

అంతేకాకుండా.. అమెరికా వద్ద ఉన్న ఓ రహస్య ఆయుధం, కిమ్​తో సంబంధాల గురించి కూడా ట్రంప్ చెప్పినట్లు బాబ్ తెలిపారు.

కిమ్​తో సంబంధాలపై..

ట్రంప్​, ఉత్తరకొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​కు సంబంధించి 25 వ్యక్తిగత లేఖలను సంపాదించినట్లు చెప్పారు ఉడ్​వర్డ్. అందులో ఓ లేఖలో తమ బంధాన్ని ఫాంటసీ చిత్రంతో పోల్చారు కిమ్​. సింగపూర్​లో భేటీ సమయంలో కిమ్​ పట్ల ట్రంప్ ఆకర్షితులయ్యారని చెప్పారు బాబ్.

"కిమ్​ మనం అనుకున్నదానికన్నా చాలా తెలివైనవారని ట్రంప్ అన్నారు. తనతో అన్ని విషయాలు పంచుకున్నట్లు తెలిపారు. తన అంకుల్​ను ఎలా చంపారో కూడా ట్రంప్​కు కిమ్​ పూర్తిగా వివరించారు. నిఘా అధికారుల అంచనాల ప్రకారం ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను ఎన్నటికీ వీడదని చెప్పారు. ప్యాంగాంగ్​ను ఎలా నియంత్రించాలో సీఐఏకూ అర్థం కావట్లేదన్నారు."

- రేజ్​ పుస్తకంలోని కొన్ని వివరాలు

ఇదీ చూడండి:'నోబెల్​ శాంతి బహుమతి' రేసులో ట్రంప్!

ABOUT THE AUTHOR

...view details