తెలంగాణ

telangana

ETV Bharat / international

'తల్లిదండ్రులు చదివితేనే పిల్లలకు పదకోశం'

పిల్లలకు పదకోశం పెరగాలంటే తల్లిదండ్రులు.. వాళ్లకు పుస్తకాలు చదివి వినిపించాల్సిందేనని సర్వేలో తేలింది. ఈ అంశంపై ఓహియో విశ్వవిద్యాలయ ఆచార్యులు జెస్సికా లోగన్ పరిశోధన చేశారు. 'కిండర్​గార్టెన్​'కు వెళ్లే చిన్నారుల్లో రోజుకు కనీసం 5 పుస్తకాలు చదివి వినిపించిన తల్లిదండ్రుల పిల్లలకు ఎక్కువ పదకోశం ఉంటోందని తేల్చారు.

By

Published : Apr 7, 2019, 6:33 PM IST

Updated : Apr 7, 2019, 8:51 PM IST

'తల్లిదంద్రులు చదవితేనే పిల్లలకు పదకోశం'

ఓ సాయంకాలం వేళ చిన్నారులకు పొద్దు పోవాలంటే... ఏ అమ్మమ్మో, నాయనమ్మో చెప్పే కథే ఆధారం. అలనాటి అమ్మమ్మ ముచ్చట్లు చక్కటి ఎంటర్​టైన్​మెంటే కాదు ఓ ఇన్​ఫోటైన్​మెంట్. ఓహియో విశ్వవిద్యాలయం పరిశోధనాత్మక నివేదికతో మరోసారి దీన్ని ధ్రువీకరించింది.

చిన్నారులకు ఈరోజుల్లో వినోదం పంచేవి అంటే పవర్​ రేంజర్స్, చోటా భీమ్, డోరేమాన్, స్పైడర్​మాన్, బ్యాట్​మాన్, మిక్కీమౌస్ వంటివే. కానీ అమెరికా లోని ఓహియో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెస్సికా లోగన్ చేసిన పరిశోధన మాత్రం చిన్నారులకు తల్లిదండ్రులు పుస్తకాలు చదివి వినిపించాలన్న విషయాన్ని నొక్కి చెబుతోంది. ఏ కథ వినకుండా బడిలో అడుగు పెట్టిన విద్యార్థి కంటే కథలు వింటూ పాఠశాలలో చేరిన పిల్లలు ఎంతో ముందంజలో ఉన్నారట..!

నివేదికలోని ముఖ్యాంశాలు

  • మీరు రోజుకు 5 పుస్తకాలు చదివి వినిపిస్తే మీ పిల్లలు 14 లక్షలకు పైగా కొత్త పదాలు వింటారు.
  • రోజుకు ఓ కొత్త పుస్తకాన్ని మీ పిల్లలకు వినిపిస్తే 2 లక్షల 90 వేల పద సంపద మీ చిన్నారి మెదడులో నిక్షిప్తమైనట్లే.
  • ఎక్కువ పదాల్ని విన్న పిల్లలు వాటిని పాఠశాలలో చూడడానికి సిద్ధపడతారు.
  • చదివే అలవాటు త్వరగా అలవడుతుంది.
  • ఎప్పుడూ పుస్తకాల్ని వినని పిల్లలకు ఓ మాసానికి మహా అయితే పద సంపద 4662 మాత్రమే. అదే రోజుకు అయిదు పుస్తకాల్ని చదివిస్తే 14,83,300.
  • పుస్తకాలు విన్న పిల్లలకూ ఎప్పుడూ చదివించని పిల్లలకూ మధ్య పదాల భేదం ఎంతో తెలుసా అక్షరాలా 10లక్షలు.
  • రోజువారీ వాడకంలో ఉపయోగించే పదాలు కాకుండా... పుస్తకాల్లో ఉండే సంక్లిష్టమైన పదాలకు అర్థాలు తెలుసుకుంటారు.
  • నూతన అంశాలు మీ పిల్లలకు పరిచయమవుతాయి.

లోగన్ పరిశోధన సాగిందిలా...!

ఈ పరిశోధన ఆలోచన తన పూర్వ పరిశోధనలో గమనించిన జాతీయ నమూనా ద్వారా వచ్చిందన్నారు జెస్సికా లోగన్. నాలుగింట ఒక వంతు పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడూ చదివి వినిపించలేదని ఇది తేల్చింది. ఈ జాతీయ నమూనా ఆధారంగానే లోగన్ పరిశోధన చేశారు.

మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న 100 బోర్డ్​ బుక్స్, బొమ్మల పుస్తకాల్లో 30 పుస్తకాలను తన పరిశోధనకు ఎన్నుకున్నారు. మూడేళ్ల లోపు పిల్లలకు వినియోగించే బోర్డ్​ బుక్స్​లో సరాసరిగా 140 పదాలున్నాయని, అదే బొమ్మల పుస్తకాల్లో 228 పదాలు ఉన్నట్లు తేల్చారు. ఈ గణాంకాలతో ఐదో జన్మదినం నాటికి ఎన్ని పదాలు నేర్చుకునే అవకాశం ఉందో లెక్కగట్టారు. మూడేళ్ల వయస్సు వచ్చే వరకు వివిధ రకాల బోర్డు బుక్స్​, తర్వాతి రెండేళ్లు బొమ్మల పుస్తకాలు చదువుతున్నట్లు బయటపెట్టారు.

Last Updated : Apr 7, 2019, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details