అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికవడం వల్ల ఆమె భర్త డగ్లస్ ఎమ్హోఫ్నకు.. 'సెకెండ్ జెంటిల్‌మేన్' స్థానం కల్పించనున్నారు. న్యాయవాది అయిన డగ్లస్(56).. అమెరికా తొలి 'సెకెండ్ జెంటిల్‌మేన్'గా చరిత్రకెక్కనున్నారు. ఇదివరకు ఉపాధ్యక్షులుగా అందరూ పురుష అభ్యర్థులే ఎన్నికవడం వల్ల.. వారి భార్యలకు ద్వితీయ మహిళ హోదా ఇచ్చేవారు. కానీ అగ్రరాజ్య చరిత్రలోనే.. ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం వల్ల ఆమె భర్తకు సెకెండ్ జెంటిల్‌మేన్ స్థానం కల్పించనున్నారు.
'సెకెండ్ జెంటిల్‌మేన్'గా హారిస్ భర్త డగ్లస్
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ కమలా హారిస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఆమె భర్త డగ్లస్ సైతం ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
సెకెండ్ జెంటిల్‌మేన్‌గా డగ్లస్..
వచ్చే ఏడాది జనవరిలో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఆయనకు అధికారిక హోదా ఇవ్వనున్నారు. కమలా హారిస్, డగ్లస్.. 2014లో వివాహం చేసుకున్నారు.