కాబుల్ విమానాశ్రయం వద్ద జరిగిన జంట దాడులను(kabul airport blast) ప్రపంచ దేశాలు ముందే గుర్తించినప్పటికీ, సకాలంలో స్పందించలేదు. ఈ కారణంగా 100 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఐసిస్-కే సభ్యులు అక్కడి వరకు ఎలా వెళ్లగలిగారన్న విషయంపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. భద్రత విషయంలో అమెరికా దారుణంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ చెక్‌పోస్ట్‌లు ఎలా దాటారు?
తాలిబన్ల(taliban news) ఆక్రమణ అనంతరం కాబుల్ విమానాశ్రయానికి అఫ్గానీలు పరుగులు పెట్టారు. వారం రోజులు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దేశాన్ని వీడేందుకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితులను అదుపు చేసేందుకు విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి అమెరికా దళాలు. సహాయం అందించేందుకు తాలిబన్లు ముందుకు రావడం విశేషం.
రద్దీగా ఉంటున్న విమానాశ్రయం ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని, ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడులు చేయవచ్చని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు హెచ్చరించాయి. అయినా సకాలంలో అధికారులు స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్కడి భద్రతా ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి:-కాబుల్‌లో గుబుల్.. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన
యూఎస్ ఆర్మీ 10వ మౌంటైన్ డివిజన్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భద్రత కల్పిస్తోంది. యూఎస్ 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు రన్‌వే భద్రతను అప్పగించారు. పౌరుల తరలింపును 24వ మెరైన్ ఎక్స్పిడీషనరీ బృందం చూసుకుంటోంది. మొత్తం మీద విమానాశ్రయంలో 6,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు(us forces in kabul airport). విమానాశ్రయం బయట తాలిబన్లు గస్తీ కాస్తున్నారు. 'రెడ్ యూనిట్' పేరుతో అత్యున్నత దళాన్ని రంగంలోకి దింపారు తాలిబన్లు.