తెలంగాణ

telangana

ETV Bharat / international

సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్​కు చుక్కెదురు

మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చుకునేందుకు అత్యయిక స్థితి విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. రక్షణ శాఖ నిధులను మళ్లించేందుకు​ ట్రంప్​ చేస్తున్న పరిపాలన విధమైన ప్రయత్నాలను నిలిపేస్తూ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. మెక్సికో సరిహద్దులో రెండు ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.

By

Published : May 25, 2019, 10:27 AM IST

Updated : May 25, 2019, 11:47 AM IST

సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్​కు చుక్కెదురు

సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్​కు చుక్కెదురు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ఫెడరల్​ కోర్టులో చుక్కెదురైంది. దేశంలో అత్యవసర స్థితి విధించి సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు సమీకరించుకోవాలనుకున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. రక్షణ శాఖ నిధులను మళ్లించేందుకు చేపట్టిన పరిపాలనా పరమైన ప్రయత్నాలను నిలిపేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ హేవుడ్​​ గిలియమ్​ తీర్పు వెలువరించారు.

మెక్సికో సరిహద్దులోని రెండు ప్రాంతాల్లో 51 మైళ్ల మేర నిర్మించే రెండు ప్రాజెక్టులను శనివారం ప్రారంభించాలని నిర్ణయించారు. కోర్టు ఆదేశాలతో ట్రంప్​ ప్రయత్నాలకు గండి పడింది.

ఈ అంశంపై కాలిఫోర్నియాతో సహా 20 రాష్ట్రాలు పిటిషన్​ దాఖలు చేశాయి. వాటితో పాటు సియెర్రా క్లబ్​, సరిహద్దులోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో మరో పిటిషన్​ దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టారు జస్టిస్​ గిలియమ్​.

సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి అంతకుముందు 35 రోజుల పాటు ప్రభుత్వాన్ని పాక్షికంగా మూసివేశారు ట్రంప్​. నిధుల విడుదలకు డెమొక్రాట్లు అంగీకరించాల్సిందేనని ట్రంప్​ పట్టుబట్టారు. కానీ వారి నుంచి ఎలాంటి ఆమోదం లభించకపోవటం వల్ల ఫిబ్రవరిలో జాతీయ అత్యయిక స్థితి విధించారు.

అనంతరం దిగివచ్చిన కాంగ్రెస్​ 1.375 బిలియన్​ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. సరిహద్దు గోడ నిర్మాణానికి కావాల్సిన 8 బిలియన్​ డాలర్లను ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సమకూర్చుకునేందుకు అత్యవసర స్థితిని కొనసాగించారు ట్రంప్​. అధ్యక్షుడి నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదీ చూడండి: మధ్యప్రాచ్యంలో భారీగా బలగాల మోహరింపు: అమెరికా

Last Updated : May 25, 2019, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details