తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇవాంకా ట్రంప్​ 'పీఏ'కి కరోనా పాజిటివ్​

By

Published : May 9, 2020, 12:41 PM IST

Updated : May 9, 2020, 1:17 PM IST

Ivanka Trump's personal assistant tests positive for coronavirus
ఇవాంకా ట్రంప్​ 'పీఏ'కు కరోనా పాజిటివ్​

13:08 May 09

శ్వేతసౌధంలో కరోనా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్​ 'పీఏ'కు కొవిడ్​ సోకింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే.. 2 నెలలుగా ఆ పీఏ ఇవాంకాకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమె వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే సంబంధిత కార్యకలాపాలు చూస్తున్నట్లు సమాచారం.  

ఇవాంకాకు కరోనా లక్షణాలు ఏమీ లేవని ఓ అధికారి తెలిపారు. ఇవాంక, ఆమె భర్త జారెడ్​ కుష్నర్​కు శుక్రవారం నిర్వహించిన కొవిడ్​ పరీక్షల్లో నెగటివ్​గా తేలినట్లు స్పష్టం చేశారు.  

మూడో కేసు...

ఈ కేసుతో అమెరికా అధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. ఉపాధ్యక్షుడు పెన్స్​ ప్రెస్​ సెక్రటరీకి శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలింది. అంతకుముందు.. వైట్​హౌస్​లో పనిచేసే సైనిక అధికారికి కరోనా సోకింది. ఇదే వైట్​హౌస్​లో తొలి కేసు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ట్రంప్​, పెన్స్​లకు కొవిడ్​ పరీక్షలు చేయగా వారిగి నెగటివ్​గా తేలింది. అప్పటినుంచి ఇరువురికీ రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైట్​హౌస్​ మీడియా వర్గాలు వెల్లడించాయి.  

మాస్కుల్లేకుండానే..

అధ్యక్షుడి భద్రత విషయమై ఆందోళన చెందనవసరం లేదని వెల్లడించారు శ్వేతసౌధం అధికారులు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వైట్​హౌస్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మాస్కులు ధరించడం, థర్మల్​ స్క్రీనింగ్​, భౌతిక దూరం నిబంధన పాటించడం తప్పనిసరి చేశారు. 

అయితే.. వైట్​హౌస్​ కరోనావైరస్​ టాస్క్​ఫోర్స్​కు నేతృత్వం వహిస్తున్న పెన్స్​ ఇటీవల ఓ సమీక్షకు మాస్కు లేకుండా హాజరవడం విమర్శలకు కారణమైంది. అధ్యక్షుడు ట్రంప్​ కూడా వివిధ కార్యక్రమాలకు మాస్కు ధరించకుండానే హాజరవుతున్నారు. 

12:36 May 09

ఇవాంకా ట్రంప్​ 'పీఏ'కి కరోనా పాజిటివ్​

అమెరికా శ్వేతసౌధంలో కరోనా కలకలం రేపుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ 'పీఏ'కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అగ్రరాజ్య అధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో ఇది మూడో కొవిడ్​ కేసు కావడం గమనార్హం. 

Last Updated : May 9, 2020, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details