కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రస్తుతం 'అన్‌లాక్' దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనాతో మూతపడ్డ పర్యటక ప్రదేశాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం మొదలుపెట్టారు. పర్యటనలు సాగిస్తున్నారు. మరి కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ హోటళ్లలో ఉండటం సురక్షితమేనా?
అదే మంచిది..
పర్యటనలకు సంబంధించి అమెరికా వ్యాధి నివారణ నియంత్రణ కేంద్రం(సీడీసీ) ఓ అప్డేట్ను విడుదల చేసింది. కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే ఇంట్లో ఉండటమే మేలు అని తేల్చిచెప్పింది.
ఒకవేళ పర్యటించాల్సి వచ్చినప్పటికీ.. తెలియని వారితో కన్నా సొంత వారితో హోటల్‌ను పంచుకోవడం సురక్షితమని స్పష్టం చేసింది. అదే సమయంలో ఎక్కువ మంది ఉన్న హోటళ్లకు దూరంగా ఉంటే మంచిదని తెలిపింది.
అతిథుల మధ్య 72 గంటల బఫర్ పీరియడ్ ఉన్న హోటళ్లను ఎంచుకోవడం శ్రేయస్కరమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని అంటువ్యాధి నిపుణుడు డా. నటష్క తుష్నిక్ వెల్లడించారు.
హొటళ్లలో ఉండాల్సి వస్తే.. యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను పరిశీలించాలని సీడీసీ పేర్కొంది. ఎక్కువసార్లు ముట్టుకునే పరికరాలను తుడవడం కోసం డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్‌ను ఉపయోగించాలని సూచించింది. లిఫ్ట్‌కు బదులు మెట్లను వాడాలని పేర్కొంది.
ఇదీ చూడండి:-కరోనాతో మృతి.. ఎన్నికల్లో గెలుపు