ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవికి 2021 చివర్లో జరిగే ఎన్నికల్లో తాను బరిలో నిలవనున్నట్లు భారత సంతతికి చెందిన ఆరోరా ఆకాంక్ష ప్రకటించారు. 34 ఏళ్ల ఆరోరా.. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యూఎన్‌డీపీలో ఆడిట్ సమన్వయకర్తగా పని చేస్తున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పదవీకాలం 2021 డిసెంబర్ 31న ముగియనుంది. రెండో సారి కూడా తాను పదవిని ఆశిస్తున్నట్లు గుటెరస్ ఇప్పటికే ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిని భద్రతామండలి సిఫార్సుల మేరకు సాధారణ సభ ఎంపిక చేస్తుంది.
ఐరాస చీఫ్ రేస్‌లో భారత సంతతి వ్యక్తి! - భారత సంతతి వ్యక్తి
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎన్నికల బరిలో తాను నిలవనున్నట్లు భారత సంతతికి చెందిన ఆరోరా ఆకాంక్ష ప్రకటించారు. ప్రస్తుతం ఐరాస అభివృద్ధి కార్యక్రమం యూఎన్‌డీపీలో ఆడిట్ సమన్వయకర్తగా పని చేస్తున్నారు ఆరోరా.
ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో బరిలో నిలవనున్నట్లు ప్రకటించిన ఆరోరా ఐక్యరాజ్యసమితిపై విమర్శలు గుప్పించారు. 75ఏళ్లలో ఇచ్చిన హామీలను సమితి నెరవేర్చలేదని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో విమర్శించారు. శరణార్ధులకు సమితి రక్షణ కల్పించలేదని, వారికి మానవతా సాయం తగ్గించారని మండిపడ్డారు. అందుకే తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లోని ప్రతి ఒక్కరూ తన అభ్యర్ధిత్వానికి మద్దతివ్వాలని కోరుతూ తమ రాయబారులకు ఈమెయిల్ పంపాలని ఆమె అభ్యర్ధించారు.
ఇదీ చూడండి:మరోసారి ఆ పదవిలో కొనసాగుతా: గుటెరస్