అమెరికా ఆర్థిక వృద్ధికి భారతీయ అమెరికన్లు ఎంతో కృషి చేశారని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రశంసించారు. దేశంలో సాంస్కృతిక చైతన్యంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
వాషింగ్టన్లో భారతీయ అమెరికన్లు నిర్వహించిన జాతీయ నిధుల సేకరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్.
"దేశంలో భారతీయ అమెరికన్లు ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది సిలికాన్ వ్యాలీ కోసం కృషి చేశారు. మరికొంతమంది పెద్ద కంపెనీలకు నేతృత్వం వహిస్తున్నారు. ఇది కొనసాగుతుంది. మనది వలసవాద దేశం. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న హెచ్1బీ వీసా, చట్టబద్ధమైన వలసదారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాం."
- జో బైడెన్, అమెరికా అధ్యక్ష అభ్యర్థి