తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో భారతీయ జనాభా వృద్ధి అదుర్స్​!

అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య 2010-17 మధ్య 38శాతం పెరిగిందని "సౌత్​ ఏషియన్​ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్" అనే సంస్థ తాజా సర్వేలో వెల్లడించింది. దక్షిణాసియా పరంగా చూస్తే అమెరికాలోని ప్రవాస నేపాలీల​ జనాభా అత్యధికంగా 206.6 శాతం పెరిగినట్లు పేర్కొంది.

By

Published : Jun 18, 2019, 2:19 PM IST

పెరిగిన ఇండోఅమెరికన్లు

అమెరికాలో 2010 నుంచి 2017 మధ్య ఏడేళ్ల కాలంలో ప్రవాస భారతీయుల జనాభా 38శాతం పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

"సౌత్​ ఏషియన్​ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్"​ (ఎస్​ఏఏఎల్​టీ) సంస్థ తాజా జనాభా గణాంకాల్లో భారత్​తో పాటు అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా వాసులకు సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడించింది.

కనీసం 6,30,000 మంది భారతీయులు సరైన ధృవపత్రాలు లేకుండానే అమెరికాలో ఉంటున్నట్లు పేర్కొంది. 2016లో దాదాపు 2,50,000 మంది భారతీయులు వారి వీసా గడువు కన్నా ఎక్కువ రోజులు ఉన్నారని, ఫలితంగా ఇప్పుడు సరైన ధృవపత్రాలు లేని ప్రవాసులుగా మారారని పేర్కొంది.

దక్షిణాసియా పరంగా చూస్తే..

అమెరికాలో ఉంటున్న దక్షిణాసియన్ల జనాభా 40 శాతం వృద్ధి చెందింది. 2010లో 3.5 మిలియన్లుగా ఉన్న వీరి సంఖ్య 2017లో 5.4 మిలియన్లకు చేరిందని నివేదిక తెలిపింది.

దేశాల వారీగా చూస్తే.. నేపాల్​ జనాభా ఏకంగా 206.6 శాతం పెరిగింది. ఆ తర్వాత భారతీయులు 38 శాతం, భూటాన్​ జనాభా 38 శాతం, పాకిస్థానీలు 33 శాతం, బంగ్లాదేశీయులు 26 శాతం, శ్రీలంకన్​లు 15 శాతం వృద్ధి చెందారు.

ప్రస్తుతం 4,300 మంది దక్షిణాసియన్లు డిఫర్డ్​ యాక్షన్ ఫర్ చైల్డ్​హుడ్​ అరైవల్స్​ (డీఏసీఏ) కింద అనుమతి పొందిన వారు ఉన్నారు. డీఏసీఏ అంటే బాల్యంలోనే అమెరికా వచ్చిన వారిపై అనర్హత వేటు పడకుండా అనుమతినిచ్చే చట్టం.

2018 నాటికి మొత్తం 20,000 మంది భారతీయులు డీఏసీఏకు దరఖాస్తు చేసుకోగా... 13 శాతం అంటే 2,550 మంది భారతీయులు మాత్రమే డీఏసీఏ కింద అనుమతి పొందారు.
డీఏసీఏ అర్హత పొందిన దక్షిణాసియాలోని ఇతర దేశాల జనాభా సంఖ్య ఆందోళనకరంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. నివేదిక ప్రకారం డీఏసీఏ పొందిన పాకిస్థానీలు 1,300, బంగ్లాదేశీయులు 470 , శ్రీలంకన్​లు 120 , నేపాలీలు 60 మంది ఉన్నారు.

ఎస్​ఏఏఎల్​టీ తెలిపిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు

అమెరికాలో ఉన్న ఐదు మిలియన్ల దక్షిణాసియా జనాభాలో దాదాపు ఒక శాతం మంది పేదరికంలో ఉన్నారు. ఇందులో బంగ్లాదేశ్, నేపాల్​ జనాభానే అధికం.

ఎస్​ఏఏఎల్​టీ ప్రకారం 1997 నుంచి హెచ్​-1బీ వీసా ఉన్న 1.7 మిలియన్ల మంది జీవిత భాగస్వాములు హెచ్​-4 వీసాలు పొందారు.

2017లో 136,000 మంది వ్యక్తులు హెచ్​-4 వీసా పొందారు. హెచ్​-4 వీసాలు పొందిన వారిలో 86 శాతం మంది దక్షిణాసియా వాసులే.

ఇదీ చూడండి: ఎయిర్​టెల్​, వొడా-ఐడియాకు భారీ పెనాల్టీ ఖాయం?

ABOUT THE AUTHOR

...view details