ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి తాము తయారు చేసిన 50 మిలియన్ల కరోనా టీకా డోసుల్ని భారత్‌కు అందించేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో కరోనా టీకాల కొరత కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అనేక రాష్ట్రాలు నేరుగా టీకాలను కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి.
భారత్‌కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులు? - pfizer vaccine to india
భారత్‌కు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ఈ ఏడాదిలో 5 కోట్ల కరోనా టీకాలను సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వంతో చర్చిస్తోందని సమాచారం. కాగా, ప్రస్తుతానికి టీకా ఎగుమతులకు అమెరికాలో అనుమతి లేదు.
అయితే, అమెరికాలో ఉత్పత్తి అవుతున్న ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను ఎగుమతి చేయడానికి ఇప్పటి వరకు అమెరికా అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాల్లో ఫైజర్ టీకాను ఉత్పత్తి చేస్తున్న కేంద్రాల నుంచే భారత్‌కు సరఫరా చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ఆధారంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్లు భారత్‌లో గుర్తించిన వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నాయని 'యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ'(ఈఎంఏ) తెలిపింది. దీనిపై మరింత లోతైన అధ్యయనం జరుపుతున్నట్లు తెలిపింది. ఈఎంఏ ఇప్పటికే ఫైజర్, మోడెర్నా, అస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి ఇచ్చింది.
ఇదీ చూడండి:భారత్- ఆస్ట్రేలియా విమాన సర్వీసులు ప్రారంభం