అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రత్యర్థి పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. నవంబర్న 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్తి జో బైడెన్ గనుక గెలిస్తే.. నెలలోపే కమ్యూనిస్ట్ కమలా హారిస్ అధికారం చేపడతారన్నారు.
"గత రాత్రి జరిగిన సంవాదాన్ని నేను పోటీ కాదని అనుకున్నాను. కమల చాలా భయంకరంగా ఉన్నారు. ఆమె తీరును ఎవరూ ఇష్టపడరు. ఆమె ఓ కమ్యూనిస్ట్. మనకు ఓ కమ్యూనిస్ట్ ప్రభుత్వం రాబోతోంది. జో బైడెన్ను స్వయంగా చూసి నేను చెప్తున్నాను.. ఒకవేళ ఆయన గనుక అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రెండు నెలలు కూడా అధికారంలో ఉండరు."
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
సైనిక ఆస్పత్రి నుంచి వచ్చిన అనంతరం.. తొలిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. బైడెన్, హారిస్ లాగా రిపబ్లికన్లు అబద్ధం చెబితే.. మీడియా పెద్దఎత్తున విమర్శించేదని ఓ ట్వీట్లో పేర్కొన్నారు ట్రంప్. నకిలీ వార్తలను డెమోక్రట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.